6. నటరాజ వైభవం
నటరాజ వైభవం ( చిదంబరంలో శివుడు నటరాజ స్వరూపుడై, నిరాకారుడిగా కొలువబడుతున్నాడు. చిదంబర రహస్యం ఏమిటంటే “భక్తుడు తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భగవంతుడు తన భక్త్తుడి అజ్ఞానాన్ని తొలగింపచేసి, ఆయన యెక్క దర్శన ప్రాప్తి కలిగించి, ఆయన ఉనికిని అనుభవించేసి, ముక్తిని ప్రసాదిస్తాడు.”) * నటరాజ నీ రూప నీరాజనం... కనులారా అరవింద శ్రీ రాజసం. • రసరంజ రాగానికి నర్తించే నీ నాట్యం... సృష్టి స్థితి లయల సోపానం. • బ్రోటనవేలి బింబం పై తాండవమాడే... అభినయాల ఆనందరూపా. • నవరసాల అష్టాశత(108) భంగిమలతో.... నలుదిక్కుల నడయాడే నీ నాట్యం... విశ్వ సమ్మోహనాస్త్రం. • నీ ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసాలే జనన మరణాల చక్రం. • నీ జటాజూట అలల తరంగాలకు.. మా డబ్బెది రెండు వేల నాడులు... కంపనలై ప్రకంపనలై అణువణువున... జ్వలించెను మా లో ఓంకారం. • ఆహా! ఏమి ఈ అద్భుతం ఈశ్వరా! పరమేశ్వర! • నీ అడుగుల సవ్వడులే ఖగోళ కదలికల పర్యంతం. • నీ చూపుల మోహం... అనంత విశ్వ తారల తళుకుల తేజం. • నీ దేహం అనంత వాయువుల... ఖగోళ శక్తికి కర్మాగారం. • అజ్ఞానాన్ని అణ...