1. ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ
*ఈశ్వరా...... ప్రాణేశ్వరా.
• దివిజ గంగాధరా.
• పంచభూత సమ్మిళిత రూపా...
సమస్త జీవ ఆత్మాశ్రయా.
• మాయను మాపే మాహర్షి...
జ్ఞానం నింపే సద్గురువా.
• శ్మశానమే ఆవాస మంటావు...
భస్మమే జీవం అంటావు.
• ఈశ్వరా...... ఓంకారరూపేశ్వరా.
• త్రిలోకం.... త్రిగుణం.....త్రినేత్రాధి నేతనంటావు...
త్రిశూలంతో రక్షణ నిస్తావు.
• ధ్యానమే ధ్యాసంటావు...
ధ్యానంలో దర్శనమిస్తావు.
• ధ్యానేంద్రా........ఓ యోగీంద్రా.
• కంఠంలోని గరళంతో కరుణిస్తావు...
సిగలోని చంద్రుడితో శాంతి నిస్తావు.
• నీలకంఠేశ్వరా....ఓ అర్ధ నారీశ్వరా..
• నీ కంటి భాష్పాలే అక్షతలయ్యాయి... రుద్రాక్షలయ్యాయి.
• ఈశ్వరా..... ఓ రుద్రేశ్వరా.
• ఢం ఢం ఢం ఢమరుకమే శక్తి నాదమంటావు...
లయ తప్పని శృతికి నటరాజువి.
• ఈశ్వరా..... ఓ చిదంబరేశ్వరా.
• శరణు కోరిన జీవికి బోళాశంకరుడివి.....
శరణు తప్పిన పాపికి సంకట హరుడివి.
• ఓ శంకరా...బోళా శంకరా.
• ఆడుకుంటావు మాతో.....
ఆటాడుకుంటావు.
మా తత్వము నెరుగు శక్తి మాకు లేక...
నీ తత్వము నెట్లు తెలుసుకోగలమయ్యా.
• ఈశ్వరా.....ఓ జ్ఞానేశ్వరా.
• తెరిపించ వయ్యా మా మనోనేత్రం...
మరిపించ వయ్యా మా మూర్ఖత్వం.
యడ్ల శ్రీనివాసరావు. 24 June 2020 5:00 am
.jpeg)
Comments
Post a Comment