6. నటరాజ వైభవం


నటరాజ వైభవం

( చిదంబరంలో శివుడు నటరాజ స్వరూపుడై, నిరాకారుడిగా కొలువబడుతున్నాడు. చిదంబర రహస్యం ఏమిటంటే “భక్తుడు తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భగవంతుడు తన భక్త్తుడి అజ్ఞానాన్ని తొలగింపచేసి, ఆయన యెక్క దర్శన ప్రాప్తి కలిగించి, ఆయన ఉనికిని అనుభవించేసి, ముక్తిని ప్రసాదిస్తాడు.”)


* నటరాజ నీ రూప నీరాజనం...

   కనులారా అరవింద శ్రీ రాజసం.

• రసరంజ రాగానికి నర్తించే నీ నాట్యం...

   సృష్టి స్థితి లయల సోపానం‌.

• బ్రోటనవేలి బింబం పై తాండవమాడే...

   అభినయాల ఆనందరూపా.


• నవరసాల అష్టాశత(108) భంగిమలతో....

  నలుదిక్కుల నడయాడే నీ నాట్యం...

  విశ్వ సమ్మోహనాస్త్రం.


• నీ ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసాలే జనన మరణాల చక్రం.


• నీ జటాజూట అలల తరంగాలకు..

  మా డబ్బెది రెండు వేల నాడులు...

  కంపనలై ప్రకంపనలై అణువణువున...

  జ్వలించెను మా లో ఓంకారం.  


• ఆహా! ఏమి ఈ అద్భుతం ఈశ్వరా! పరమేశ్వర!

• నీ అడుగుల సవ్వడులే ఖగోళ కదలికల పర్యంతం.

• నీ చూపుల మోహం...

  అనంత విశ్వ తారల తళుకుల తేజం.

• నీ దేహం అనంత వాయువుల...

  ఖగోళ శక్తికి కర్మాగారం.

• అజ్ఞానాన్ని అణగదొక్కే నీ పాద సంకేతం...

  మానవ జన్మ స్థితికి కారకం.

• నీ రూపం నిరాకారం...

  అదియే చిదంబర రహస్యం.

• చిదానంద రూపం.... 

  శివోహం శివోహం.🙏



YSR 7 July 21 11:00 pm.

Comments

Popular posts from this blog

2. ఓం నమఃశివాయ... ఉన్నాడు లే.. ఒకడున్నాడు లే

4. అమ్మకు వందనాలు

5. ఆట ఎవరికి ఎరుక