5. ఆట ఎవరికి ఎరుక
ఆట ఎవరికి ఎరుక
* ఆట ఎవరికెరుక...
ఆడే ఆట ఎవరికెరుక ముక్కంటి...
ఓ ముక్కంటి.
• మనసులకు మాయ కలిగిస్తావు...
దుఃఖంతో భ్రమలు తొలగిస్తావు…
ఆట ఎవరికెరుక....నీవు ఆడే ఆట ఎవరికెరుక.
• మోహం కలిగిస్తావు...
వ్యామోహం కలిపిస్తావు...
తుదకు అంతా మాయేనంటావు.
• నీ రాతలో శిలలెందరో.....శిల్పాలెందరో.
• కనులు మూసి కదం తొక్కుతూ...
పాపపుణ్యాల లెక్కలు కడతావే...
ఆట ఎవరికెరుక...నీవు ఆడే ఆట ఎవరికెరుక.
• ఎవరికి ఎవరు ఏమవుతారో... బంధువులెవరో…రా బంధులు ఎవరో.
• బంధాలతో బంధీలను చేసి....
కొందరిని బలవంతులుగా....
మరికొందరిని బలహీనులుగా....
మారుస్తావెందుకో....నీ ఆట ఎవరికెరుక శివా...
• ఆశలతో అందలమెక్కిస్తావు...
ఆనందంలోనే అన్నీ ఆవిరి చేసెస్తావు.
• నీరును సృష్టించి జీవం పోశావు...
కన్నీరును సృష్టించి జీవం తీస్తావు.
• మా లో ఉంటావు...మహిమలు
చేస్తావు....మోక్షాన్నిస్తావు.
• చావు పుట్టుకల నడుమ...
ఆట బొమ్మలతో నీవు...
ఆడించెడి ఆట ఎవరికెరుక.
• లయ తప్పని నటరాజువి...
నట జీవులకు రారాజువి.
• బూడిదనే విభూతి చేసి...
భూలోకాన్ని ఏలే భూ తల వాసి...
ఆట ఎవరికెరుక....
నీవు ఆడే ఆట ఎవరికెరుక...
ఈశ్వరా…. పరమేశ్వరా.
🙏🙏🙏
యడ్ల శ్రీనివాసరావు 1 July 21 8:00 am
.jpeg)
Comments
Post a Comment