4. అమ్మకు వందనాలు

 అమ్మకు వందనాలు

* అమ్మలను కన్న మా అమ్మ ఆనంద రూపిణీ.

• అండ పిండ బ్రహ్మాండమ్ముల క్షేత్ర స్వరూపిణి.

• సృష్టి కి మూలం నీవు.

• ప్రతిసృష్టి కి మూలం నీవు.

• ప్రకృతిలోని పులకరింతలు...

   నీ పరవశానికి  ప్రతిరూపాలు...జగత్ జననీ.

• నిర్జీవాని కి జీవం పోసే వసుధరణివి.

• జీవాన్ని నిర్జీవం చేసే శత్రు సంహారి కాళికవి.

• శక్తికి బీజమైన భైరవి...

  నీ దేహమంత ఈ విశ్వంలో...

  అణువంత భాగ్యులం తల్లీ.

• క్షేత్రమున కానరాని దేదమ్మ నీ కంటికి.

• ప్రేమను పంచే పరమేశ్వరి....

  కరుణను చూపే కాదంబరి....

  లాలించే నీలాంబరి.

• నీ ఆగ్రహానికి భీతిల్లే నీ బిడ్డలం...

  నీ అనుగ్రహం తోనే ఊపిరి పోసుకున్నాం...

• మూర్ఖత్వంతో ముదిరిన మా మస్తిష్కాలకి...

  నీ మననం తో మురిపించు తల్లీ...

  ఓ జ్ఞాన ధాత్రి. 

🙏🙏


క్షేత్రము = సమస్తము, విశ్వము, శరీరము.

మస్తిష్కము = మెదడు

మననం = జపించుట, ధ్యానం, పదే పదే తలచుట.


YSR 09 May 21 3:00 pm.

Comments

Popular posts from this blog

2. ఓం నమఃశివాయ... ఉన్నాడు లే.. ఒకడున్నాడు లే

5. ఆట ఎవరికి ఎరుక