Posts

6. నటరాజ వైభవం

Image
నటరాజ వైభవం ( చిదంబరంలో శివుడు నటరాజ స్వరూపుడై, నిరాకారుడిగా కొలువబడుతున్నాడు. చిదంబర రహస్యం ఏమిటంటే “భక్తుడు తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భగవంతుడు తన భక్త్తుడి అజ్ఞానాన్ని తొలగింపచేసి, ఆయన యెక్క దర్శన ప్రాప్తి కలిగించి, ఆయన ఉనికిని అనుభవించేసి, ముక్తిని ప్రసాదిస్తాడు.”) * నటరాజ నీ రూప నీరాజనం...    కనులారా అరవింద శ్రీ రాజసం. • రసరంజ రాగానికి నర్తించే నీ నాట్యం...    సృష్టి స్థితి లయల సోపానం‌. • బ్రోటనవేలి బింబం పై తాండవమాడే...    అభినయాల ఆనందరూపా. • నవరసాల అష్టాశత(108) భంగిమలతో....   నలుదిక్కుల నడయాడే నీ నాట్యం...   విశ్వ సమ్మోహనాస్త్రం. • నీ ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసాలే జనన మరణాల చక్రం. • నీ జటాజూట అలల తరంగాలకు..   మా డబ్బెది రెండు వేల నాడులు...   కంపనలై ప్రకంపనలై అణువణువున...   జ్వలించెను మా లో ఓంకారం.   • ఆహా! ఏమి ఈ అద్భుతం ఈశ్వరా! పరమేశ్వర! • నీ అడుగుల సవ్వడులే ఖగోళ కదలికల పర్యంతం. • నీ చూపుల మోహం...   అనంత విశ్వ తారల తళుకుల తేజం. • నీ దేహం అనంత వాయువుల...   ఖగోళ శక్తికి కర్మాగారం. • అజ్ఞానాన్ని అణ...

5. ఆట ఎవరికి ఎరుక

Image
  ఆట ఎవరికి ఎరుక * ఆట ఎవరికెరుక...    ఆడే ఆట ఎవరికెరుక ముక్కంటి...    ఓ ముక్కంటి. • మనసులకు మాయ కలిగిస్తావు...   దుఃఖంతో భ్రమలు తొలగిస్తావు…   ఆట ఎవరికెరుక....నీవు ఆడే ఆట ఎవరికెరుక. • మోహం కలిగిస్తావు...    వ్యామోహం కలిపిస్తావు...    తుదకు అంతా మాయేనంటావు. • నీ రాతలో శిలలెందరో.....శిల్పాలెందరో. • కనులు మూసి కదం తొక్కుతూ...   పాపపుణ్యాల లెక్కలు కడతావే...   ఆట ఎవరికెరుక...నీవు ఆడే ఆట ఎవరికెరుక. • ఎవరికి ఎవరు ఏమవుతారో...           బంధువులెవరో…రా బంధులు ఎవరో. • బంధాలతో బంధీలను చేసి....   కొందరిని బలవంతులుగా....  మరికొందరిని బలహీనులుగా....  మారుస్తావెందుకో....నీ ఆట ఎవరికెరుక శివా... • ఆశలతో అందలమెక్కిస్తావు...   ఆనందంలోనే అన్నీ ఆవిరి చేసెస్తావు. • నీరును సృష్టించి జీవం పోశావు...   కన్నీరును సృష్టించి జీవం తీస్తావు. • మా లో ఉంటావు...మహిమలు   చేస్తావు....మోక్షాన్నిస్తావు. • చావు పుట్టుకల నడుమ...   ఆట బొమ్మలతో నీవు...   ఆడించెడి ఆట ఎవరికెరుక. • లయ తప్పని నట...

4. అమ్మకు వందనాలు

Image
 అమ్మకు వందనాలు * అమ్మలను కన్న మా అమ్మ ఆనంద రూపిణీ. • అండ పిండ బ్రహ్మాండమ్ముల క్షేత్ర స్వరూపిణి. • సృష్టి కి మూలం నీవు. • ప్రతిసృష్టి కి మూలం నీవు. • ప్రకృతిలోని పులకరింతలు...    నీ పరవశానికి  ప్రతిరూపాలు...జగత్ జననీ. • నిర్జీవాని కి జీవం పోసే వసుధరణివి. • జీవాన్ని నిర్జీవం చేసే శత్రు సంహారి కాళికవి. • శక్తికి బీజమైన భైరవి...   నీ దేహమంత ఈ విశ్వంలో...   అణువంత భాగ్యులం తల్లీ. • క్షేత్రమున కానరాని దేదమ్మ నీ కంటికి. • ప్రేమను పంచే పరమేశ్వరి....   కరుణను చూపే కాదంబరి....   లాలించే నీలాంబరి. • నీ ఆగ్రహానికి భీతిల్లే నీ బిడ్డలం...   నీ అనుగ్రహం తోనే ఊపిరి పోసుకున్నాం... • మూర్ఖత్వంతో ముదిరిన మా మస్తిష్కాలకి...   నీ మననం తో మురిపించు తల్లీ...   ఓ జ్ఞాన ధాత్రి.  🙏🙏 క్షేత్రము = సమస్తము, విశ్వము, శరీరము. మస్తిష్కము = మెదడు మననం = జపించుట, ధ్యానం, పదే పదే తలచుట. YSR 09 May 21 3:00 pm.

3. శ్రీ రమణ మహర్షి జయంతి.

Image
  ఓం శ్రీ గురుభ్యోనమః పూజ్యనీయులు, ఆత్మస్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ రమణమహర్షి ల వారి జయంతి సందర్భంగా వారి దివ్య చరణారవింద పాదపద్మములకు నమస్కరిస్తూ... ధర్మం ఒక పాదము మీద నడిచే కలియుగంలో 90 శాతం మానవ జీవితం అరిషడ్వర్గాల తో , దుర్భరం తో, తిరోగమనం తో, అంధకారంలో బ్రతుకుతున్న మానవుని పై జాలి, ప్రేమతో భగవంతుడు శ్రీ రమణులు వంటి మహనీయుల రూపం లో మానవ శరీరం ధరించి , సమస్త మానవాళికి, జగత్తు కు వెలుతురు చూపించే జ్ఞాన జ్యోతి గా అవతరించారు.  “యోగం” అంటే రాజరికం, భోగం, విలాసం అనే ఆలోచన తో ఉన్న మానవునికి “యోగం” అంటే “అంతరంగం లో ఉన్న ఆత్మను గ్రహించి, ఆత్మానందం కలిగివుండటం” అని తెలియచేసిన మహా యోగీశ్వరులు రమణమహర్షుల వారు. • మీ నిరాడంబరత మానవుని బ్రతుకు బాట కు రాజమార్గం. • మీ ప్రేమ తత్వం సమస్త జీవుల బాంధవ్యాలకు జ్యోతి స్వరూపం. • మీ మౌనం భూమండలం లోని మానవాళి సమస్యలకు పరిష్కారం. • మీ వంటి మహర్షులు నేడు భౌతికంగా కనిపించకపోయినా ఈ పంచభూతాలలో అణువణువై మా శరీరం, ఆత్మలను స్పృశిస్తూ, మిము తలచిన వారి చెంత నిరంతరం వెన్నంటి నడిపిస్తారు...అని సంతోషంగా చెప్పుకో గల అద్రుష్టవంతుడిని నేను... ఎందుకంటే ఏ ఆలోచన, అక్...

2. ఓం నమఃశివాయ... ఉన్నాడు లే.. ఒకడున్నాడు లే

Image
   ఓం నమఃశివాయ... ఉన్నాడు లే ... ఒకడున్నాడు లే. *ఉన్నాడు లే...   యుగమొక క్షణమును చేసే యోగి...   ఒకడున్నాడులే. • జగమున జనముకు రక్షకుడై ఉన్నాడులే…    పరిరక్షకుడై యున్నాడులే. • నట నాట్యం తో తాండవమెత్తి….   ప్రక్రుతి పాలకుడై యున్నాడులే....   ఒకడున్నాడు లే. • తేటతెల్లమైన మేని విభూది తో....   స్థితప్రజ్ఞడై.....శాంతి కాముకుడై....   థ్యానముద్రకు ప్రతీకుడై యున్నాడులే. • సుందర మనోహర...   చిద్విలాస చిదానందుడి...   కనుపాప బాష్పమునైన ధన్యం…   నా ఈ జన్మ ధన్యం. • ఓం నమఃశివాయ…. శివాయ నమః  ఓం. యడ్ల శ్రీనివాసరావు  5 July 7:00 am.

1. ఓం నమఃశివాయ

Image
 ఓం నమఃశివాయ *ఈశ్వరా...... ప్రాణేశ్వరా. • దివిజ గంగాధరా. • పంచభూత సమ్మిళిత రూపా...   సమస్త జీవ ఆత్మాశ్రయా. • మాయను మాపే మాహర్షి...    జ్ఞానం నింపే సద్గురువా. • శ్మశానమే ఆవాస మంటావు...    భస్మమే జీవం అంటావు. • ఈశ్వరా...... ఓంకారరూపేశ్వరా. • త్రిలోకం.... త్రిగుణం.....త్రినేత్రాధి నేతనంటావు...    త్రిశూలంతో రక్షణ నిస్తావు. • ధ్యానమే ధ్యాసంటావు...   ధ్యానంలో దర్శనమిస్తావు. • ధ్యానేంద్రా........ఓ యోగీంద్రా. • కంఠంలోని గరళంతో కరుణిస్తావు...   సిగలోని చంద్రుడితో శాంతి నిస్తావు. • నీలకంఠేశ్వరా....ఓ అర్ధ నారీశ్వరా.. • నీ కంటి భాష్పాలే అక్షతలయ్యాయి...             రుద్రాక్షలయ్యాయి. • ఈశ్వరా..... ఓ రుద్రేశ్వరా. • ఢం ఢం ఢం ఢమరుకమే శక్తి నాదమంటావు...   లయ తప్పని శృతికి నటరాజువి. • ఈశ్వరా..... ఓ చిదంబరేశ్వరా. • శరణు కోరిన జీవికి బోళాశంకరుడివి.....    శరణు తప్పిన పాపికి సంకట హరుడివి. • ఓ శంకరా...బోళా శంకరా. • ఆడుకుంటావు మాతో.....   ఆటాడుకుంటావు.   మా తత్వము నెరుగు శక్తి మాకు లేక...   ...